News October 15, 2024

NLG: మూసీకి తగ్గిన వరద.. గేట్లు మూసివేత

image

మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు తగ్గుముఖం పట్టడంతో సోమవారం ప్రాజెక్టు అధికారులు దిగువకు నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు. HYD నగరంతోపాటు, మూసీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మూసీ ప్రాజెక్టుకు సోమవారం కేవలం 994 క్యూసెక్కుల వరదనీరు వచ్చింది. 645 అడుగుల గరిష్ఠ నీటిమట్టం గల మూసీ ప్రాజెక్టులో సాయంత్రం వరకు నీటిమట్టం 644.50 అడుగులు ఉంది.

Similar News

News November 3, 2025

చెర్వుగట్టు ఆలయ అభివృద్ధిపై మంత్రి సురేఖ సమీక్ష

image

నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ మాస్టర్ ప్లాన్‌పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.

News November 3, 2025

NLG: కలిసిరాని ‘ఖరీఫ్’

image

జిల్లా రైతులకు ఖరీఫ్ సాగు కలిసి రాలేదు. ముందస్తుగా మురిపించిన వరుణుడు.. ఆ తరువాత ముఖం చాటేశాడు. దీంతో మొలకదశలో పంటలు ఎండుముఖం పట్టాయి. ఆ తరువాత కురిసిన వర్షాలు ఉపశమనం కలిగించాయి. దీంతో ఎంతో ఆశతో రైతులు వానాకాలంలో 11,50,556 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షలు కోలుకోలేని దెబ్బ తీశాయి. జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.

News November 2, 2025

NLG: తిప్పర్తిలో ముందస్తు జనగణన షురూ!

image

తిప్పర్తి మండలంలో నిర్వహించనున్న 2027 జనగణన ముందస్తు కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. తిప్పర్తి రైతు వేదికలో 3 రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా రాష్ట్రంలో 3 ప్రాంతాలలో ముందస్తు గణన కార్యక్రమాన్ని పైలట్ పద్ధతిలో చేపట్టేందుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.