News July 10, 2025
NLG: మూసీ నది జన్మస్థానం మీకు తెలుసా?

మూసీ నది 2,168 అడుగుల ఎత్తులో ఉద్భవిస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా దీని జన్మస్థానం వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు. అక్కడ ఒక్కో బొట్టుగా మొదలై అనంతపద్మనాభుని ఆలయ కొలనులోకి చేరుతుంది. దీని ప్రవాహం అక్కడ మొదలై నదిగా మారి HYDలోకి ఎంట్రీ పోచంపల్లి, కేతేపల్లి గుండా నల్గొండ వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మహానగరమంతా దీని ఒడ్డునే జీవం పోసుకుంది. ముచ్కుంద మహానది కాలక్రమేనా మూసీగా పేరు మారింది.
Similar News
News July 10, 2025
బుమ్రా, ఆర్చర్.. అంచనాలు అందుకుంటారా?

ఇవాళ భారత్- ఇంగ్లండ్ లార్డ్స్‌లో మూడో టెస్టులో తలపడనున్నాయి. అక్కడ పిచ్ బౌలింగ్‌కు అనుకూలించే ఛాన్స్ ఉంది. అందుకే బుమ్రా, ఆర్చర్‌పై ప్లేయర్లే కాదు.. అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. బుమ్రా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకుని మళ్లీ బరిలోకి దిగుతున్నారు. వీళ్లు రాణిస్తే బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. అయితే, ఎంత మేరకు అంచనాలు అందుకుంటారో చూడాలి.
News July 10, 2025
పర్వతగిరి: హే మహాత్మా.. శిథిలావస్థకు గాంధీ విగ్రహం..!

పర్వతగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎన్నో ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన విగ్రహం ఎవరూ పట్టించుకోకపోవడంతో సిమెంట్ పెచ్చులూడి లోపల ఉన్న ఇనుప చువ్వలు బయటకు తేలుతున్నాయి. ప్రధాన కూడలిలో గాంధీ విగ్రహం శిథిలావస్థకు చేరి కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరం. పలువురు గ్రామస్థులు శిథిలావస్థకు చేరిన విగ్రహాన్ని చూసి “హే మహాత్మా” అని వాపోతున్నారు.
News July 10, 2025
నేడు మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0

AP: ప్రభుత్వం మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజు 2 కోట్ల మందితో రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనుంది. 74,96,228 మంది స్టూడెంట్స్, 3,32,770 మంది టీచర్స్, 1,49,92,456 మంది పేరెంట్స్, దాతలు ఈ వేడుకలో పాల్గొనున్నారు. మొత్తం 2.28 కోట్ల మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. పుట్టపర్తి కొత్తచెరువు ZP స్కూల్లో కార్యక్రమానికి CM చంద్రబాబు, లోకేష్ హాజరు కానున్నారు.