News August 9, 2025
NLG: మొక్కుబడిగా కార్గో సేవలు

ఇంటి వద్దకే కార్గో సేవలు పేరుకే పరిమితమయ్యాయని వినియోగదారులు అంటున్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతిలో కార్గో సేవలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని చెబుతున్నారు. NLG బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన కార్గో సేవలు ఒకప్పుడు ప్రజలకు సులభతరంగా ఉండగా.. ఇప్పుడు మొక్కుబడిగా మారాయన్న ఆరోపణలున్నాయి. ఒక్కో బుకింగ్‌కు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని కస్టమర్లు అంటున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News August 31, 2025
NLG: ‘ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు దరఖాస్తు చేసుకోవాలి’

NLG జిల్లాలోని MEPMA, హార్టికల్చర్ & సెరికల్చర్ డిపార్ట్మెంట్, DEO పరిధిలోని మోడల్ స్కూల్స్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నందు ఔట్ సోర్సింగ్ సేవలు అందించటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయములో ఎంపానెల్ అయిన ఆసక్తి గల ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలను కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారన్నారు.
News August 30, 2025
NLG: ప్రైవేట్ కళాశాలలపై నియంత్రణ ఏది?

జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ, బీఈడీ, డీఈడీ, ఫార్మసిటికల్ కళాశాలలకు గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదు. దీంతో ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ఫీజు చెల్లిస్తేనే వారి స్టడీ సర్టిఫికెట్లు ఇస్తామంటూ వేధింపులకు గురి చేస్తున్నాయి. ఇటీవల కొంతమంది విద్యార్థులు సదరు కళాశాలలపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
News August 30, 2025
NLG: సెప్టెంబర్ 30 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ – 2025లో పాల్గొనేందుకు SEP 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. ఈ పోటీలు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతాయన్నారు. ఆసక్తి ఉన్నవారు www.skillindiadigital.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ పోటీలు యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వృత్తిపరంగా ఎదగడానికి గొప్ప అవకాశమని ఆమె పేర్కొన్నారు.