News January 4, 2025
NLG: యాసంగి పంట సాగు వివరాలు
సంక్రాంతి నుంచి ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సాగు చేసిన రైతులకే పంట పెట్టుబడి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. యాసంగి సీజన్‌లో నల్గొండ జిల్లాలో 5,83,406 ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 4,78,147 ఎకరాల్లో, యాదాద్రి జిల్లాలో ఇప్పటివరకు 3,20,000 ఎకరాలు సాగవుతోందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
Similar News
News January 6, 2025
ALERT.. NLG: మాంజాతో గొంతులు తెగుతున్నాయ్!
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. గత ఏడాది రామగిరికి చెందిన ఓ యువకుడికి మాంజా తగిలి చేతికి గాయమైన విషయం తెలిసిందే.
News January 6, 2025
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ
సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పేరుతో పలు యాప్‌లు డౌన్లోడ్ చేయించి ప్రలోభ పెట్టి ప్రజల బ్యాంకు ఖాతా నుంచి నగదు దోచుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి ఘటన నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందన్నారు. ఈ కేసులో సైబర్ నేరగాళ్లు ఓ బాధితుడికి సుమారు 2కోట్లను మార్కెట్లో ఇన్‌వెస్ట్‌మెంట్ చేయించి మోసం చేశారన్నారు.
News January 5, 2025
నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి: కోమటిరెడ్డి
గర్భస్థ, శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న తాత్కాలిక ఏఎన్‌సీ భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తాత్కాలిక భవన పనుల నిర్మాణానికి ఆదివారం పూజ చేశారు.