News December 27, 2025

NLG: యువ వికాసం కోసం ఇంకా ఎదురుచూపులే!

image

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న సర్కారు లక్ష్యం దరఖాస్తులకే పరిమితమైంది. ఉమ్మడి జిల్లాలో రాజీవ్ యువ వికాసం స్కీంకు వివిధ వర్గాల నుంచి 1,78,060 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క నల్గొండ జిల్లా నుంచి 79, 052 మంది యువకులు దరఖాస్తు చేసుకున్నారు. 8 నెలలు గడుస్తున్నా నిధులు మంజూరు కాకపోవడంతో యువత నిరుత్సాహానికి గురవుతోంది. దరఖాస్తుదారులకు ఇప్పటికీ ఎదురుచూపులే మిగిలాయి.

Similar News

News December 27, 2025

దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేత

image

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడికి విద్యుత్‌ బిల్లుల బకాయిలు రూ.3.08 కోట్లుగా ఉన్నాయని పేర్కొంటూ ఏపీసీపీడీసీఎల్‌ అధికారులు హెచ్‌టీ లైన్‌ నుంచి విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. 2023 ఫిబ్రవరి నుంచి బిల్లులు చెల్లించలేదని, నోటీసులకు స్పందన లేకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. అయితే భక్తులకు ఇబ్బందులు లేకుండా జనరేటర్లు, సోలార్‌ విద్యుత్‌తో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

News December 27, 2025

జగిత్యాల: ప్రజల భద్రత కోసం చైనా మాంజాపై నిషేధం

image

జగిత్యాల జిల్లాలో చైనా మాంజాను పూర్తిగా నిషేధించామని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రజల భద్రత, పక్షుల సంరక్షణ, పర్యావరణ రక్షణ కోసం నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. చైనా మాంజాను అమ్మినా, కొన్నా లేదా ఉపయోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా విక్రయం లేదా నిల్వ కనిపిస్తే 8712672000 లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News December 27, 2025

జగిత్యాల: GO 252కు వ్యతిరేకంగా జర్నలిస్టుల ధర్నా

image

జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయం ముందు TUWJ H143 ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. GO 252 వల్ల జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ జారీ చేయాలని కోరారు. ఫీల్డ్‌లో పనిచేసే విలేకరులను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న వివక్ష అన్యాయమన్నారు.