News September 13, 2025
NLG: రజాకార్ల మారణకాండకు 79 ఏళ్లు

రజాకారులు సృష్టించిన మారణ హోమానికి సజీవ సాక్ష్యం వల్లాల గ్రామం. 1948 ఆగస్టు15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తర్వాత శాలిగౌరారం మండలం వల్లాల ప్రభుత్వ పాఠశాలలో పది మంది విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తుండగా గ్రామంపై దండెత్తిన రజాకారులు అమానుష హత్యాకాండకు తెగబడ్డారు. పాఠశాల ప్రాంగణంలోనే పది మందిని తుపాకీతో కాల్చి చంపిన ఘటనకు 79 ఏళ్లు నిండాయి.
Similar News
News September 13, 2025
మోదీ మణిపుర్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు

ఘర్షణలు జరిగిన రెండేళ్ల తర్వాత PM మోదీ మణిపుర్ <<17696611>>పర్యటన<<>>కు వెళ్లడం అక్కడి ప్రజలను అవమానించడమేనని INC మండిపడింది. ‘864 రోజుల ఘర్షణలో 300 మంది చనిపోయారు. 1500 మంది గాయపడ్డారు. 67వేల మంది నిర్వాసితులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు PM 46 విదేశీ పర్యటనలు చేశారు కానీ ఒక్కసారి కూడా మణిపుర్‌లో పర్యటించలేదు’ అని ఖర్గే విమర్శించారు. రెండేళ్ల తర్వాత మోదీ మణిపుర్ వెళ్లడం దురదృష్టకరమని ప్రియాంకా గాంధీ అన్నారు.
News September 13, 2025
నెల్లూరు: ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి మైథిలి కళ్లు దానం

స్నేహితుడి చేతిలో దారుణ హత్యకు గురైన మైథిలి ప్రియా కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. ప్రస్తుతం మైథిలి మృతదేహం నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంది. గత రాత్రి మైథిలిని ఆమె స్నేహితుడు నిఖిల్ దారుణంగా హత్య చేశాడు. మృతురాలు బి ఫార్మసీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది.
News September 13, 2025
సిరిసిల్ల: సన్నాలకు బోనస్ అందేదెప్పుడు..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు సన్నం వడ్లను సాగు చేశారు. కాగా, వీరంతా రూ.500 బోనస్ కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగిలో సుమారు 10 వేల క్వింటాళ్లకు పైగా సన్నాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే ఇప్పటివరకు బోనస్ పడలేదు. బోనస్ వస్తే పంట పెట్టుబడికి సాయంగా ఉంటుందని రైతన్నలు అంటున్నారు. ప్రభుత్వ స్పందించి ఖాతాల్లో బోనస్ వేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.