News April 13, 2025
NLG: రాత్రికి రాత్రే శివలింగం ప్రత్యక్షం..!

నల్గొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామ శివారులో అర్ధరాత్రి శివలింగం ప్రత్యక్షమైంది. ఆ శివలింగాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఆకతాయిల పనేనని గ్రామస్థులు భావిస్తున్నారు. శివలింగం ప్రత్యక్షమైన స్థలం కొంత వివాదంలో ఉన్నట్లు తెలిసింది.!
Similar News
News April 15, 2025
చీకోటి ప్రవీణ్‌పై నల్గొండలో కేసు నమోదు

బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ కుమార్‌పై నల్గొండ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నల్గొండలో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న చీకోటి ప్రవీణ్ కుమార్ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులొచ్చాయి. దీంతో అతనిపై 188, 153 సెక్షన్ల కింద నల్గొండ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.
News April 14, 2025
NLG: పత్తి సాగు ప్రశ్నార్ధకమేనా?

నల్గొండ జిల్లాలో పత్తి రైతుపై ధరల పిడుగు పడింది. రానున్న వర్షాకాలం ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు అమాంతం ధరలు పెంచేశాయి. దీంతో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టితో నష్టాలు చవిచూస్తున్న రైతులపై ఆర్థిక భారం మరింత పడనుంది. దీంతో పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2019లో ప్యాకెట్‌ధర రూ.710 ఉండగా ప్రస్తుతం 901కి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 14, 2025
NLG: మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నల్గొండ వాసి!

నల్లగొండ వాసికి అత్యున్నత పదవి లభించింది. హైకోర్ట్ న్యాయమూర్తిగా పలు ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జస్టిస్ షమీమ్ అక్తర్‌ను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ ఇటీవల రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇచ్చారు. NLGకి చెందిన ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు.