News February 17, 2025
NLG: రాష్ట్రం నుంచి ఏకైక ప్లేయర్.. SP అభినందన

ఈనెల 14, 15న బెంగళూరులో జరిగిన ఫుట్‌బాల్ సౌత్ ఇండియా సెలక్షన్స్ ట్రయల్స్‌లో సూపర్ ఆటతో ఆకట్టుకున్న రాచూరి వెంకటసాయిని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సోమవారం అభినందించారు. కాగా, NLG ఛత్రపతి శివాజీ ఫుట్‌బాల్ క్లబ్‌కి చెందిన సాయి మార్చి 8,9 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఫైనల్ రౌండ్ సెలక్షన్‌కు ఎంపికయ్యాడు. రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక క్రీడాకారుడు వెంకటసాయి అని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గిరిబాబు తెలిపారు.
Similar News
News December 27, 2025
చెరువుగట్టుకు అదనంగా రూ.1.11 కోట్ల ఆదాయం

చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈవో మోహన్ బాబు శనివారం H-1, L-1 టెండర్ల వేలం నిర్వహించారు. తలనీలాలు సేకరించుకొను హక్కునకు బహిరంగ వేలం, సీల్డు టెండర్, ఇ-టెండర్ నిర్వహించగా మూడింటిలో కలిపి 20 మంది పాల్గొన్నారు. ఈ వేలంలో అత్యధికంగా రూ.2.50 కోట్లకు గాను KM.హెయిర్స్ ఇంటర్నేషనల్, తమిళవాడు వారిపేరిట టెండర్ ఖరారు చేశారు. గతేడాది కంటే రూ.1.11 కోట్ల ఆదాయం అధికంగా వచ్చింది.
News December 27, 2025
జూన్ నాటికి ‘యంగ్ ఇండియా’ సిద్ధం కావాలి: కలెక్టర్

నల్గొండ సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ కాలనీ వద్ద ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్’ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ ప్రగతిని అడిగి తెలుసుకున్న ఆమె, పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. జూన్ నుంచి ఈ పాఠశాలలో తరగతులు ప్రారంభించేలా నిర్మాణ పనులన్నీ పూర్తి కావాలని అన్నారు.
News December 27, 2025
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ డీలక్స్ బస్సు సర్వీసు

నల్గొండ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి ఆర్టీసీ డీలక్స్ బస్సు సర్వీస్‌ను ప్రారంభించింది. నల్గొండ నుంచి ప్రతి రోజు ఉదయం 6.15 గంటలకు బస్సు బయలుదేరుతుందని ఆర్టీసీ డీపో మేనేజర్ ఎంవీ రమణ శనివారం తెలిపారు. ఎక్స్ ప్రెస్ బస్సు స్థానంలో డీలక్స్ బస్సు నడుపుతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


