News July 27, 2024
NLG: రూ.1.50 లక్షలకు పంట రుణపరిమితి పెంపు

ఉమ్మడి జిల్లాలోని సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాల పరిమితిని రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచినట్లు డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నల్గొండ డీసీసీబీ బ్యాంకులో మేనేజ్ మెంట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. తీర్మానం జీవోలు జారీ చేయగా వాటిని డీసీసీబీ ఛైర్మన్ అధికారులతో కలిసి విడుదల చేశారు. నాబార్డు డీడీఎం సత్యనారాయణ, డీసీఓలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News August 5, 2025
NLG: గొర్రెల పంపిణీ అవకతవకలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు..!

BRS ప్రభుత్వ హయాంలో రాయితీ గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలపై NLGలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పశువుల ఆస్పత్రుల్లో వెటర్నరీ డాక్టర్లను కలవడంతో పాటు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. జిల్లాలో తొలి విడతలో 28,236, రెండో విడతలో 5,696 యూనిట్లు పంపిణీ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు, గొర్రెల మందలేనివారు, గొర్రెలకు బదులు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి.
News August 5, 2025
NLG: మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే!

విధులకు హాజరు కాకుండానే హాజరయ్యామని ఫేక్ అటెండెన్స్ క్రియేట్ చేసిన పంచాయతీ కార్యదర్శులపై జిల్లా పంచాయతీరాజ్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ సృజన ఆదేశాల మేరకు జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య నోటీసులు జారీచేశారు. మొత్తం జిల్లాలో 69 మంది పంచాయితీ కార్యదర్శులతో పాటు 15 మంది మండల పంచాయతీ అధికారులకు నోటీసులు అందజేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
News August 5, 2025
NLG: డుమ్మా కొట్టడం కుదరదిక!

నల్గొండ జిల్లాలో వైద్యులు, సిబ్బంది డుమ్మాలకు అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని అమలు చేసేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 34 పీహెచ్‌సీలు, 5 యూహెచ్‌సీలు, 257 సబ్ సెంటర్లు ఉన్నాయి. వీరందరికీ ముఖ హాజరుకు సంబంధించిన మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.