News July 17, 2024

NLG: రూ.2లక్షల రుణమాఫీ.. రూ.7500 కోట్ల అవసరం..!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ. 2లక్షల రుణమాఫీపై అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలు పెట్టారు. జిల్లాలో మొత్తం 5.36లక్షల మంది రైతులు ఉండగా సుమారు రూ.7500 కోట్ల వరకు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో రుణమాఫీ రూ.500 కోట్లు కానున్నట్లు సీఈవో శంకర్‌రావు పేర్కొన్నారు. దీనిపై 19న జరిగే పాలకవర్గం సమావేశంలో నిర్ణయం తీసుకుంటారన్నారు.

Similar News

News February 22, 2026

CM కప్.. ఫైనల్‌లో నల్గొండ హాకీ జట్టు

image

హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న సీఎం కప్ క్రీడా పోటీలలో నల్గొండ బాలుర హాకీ జట్టు ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన సెమీఫైనల్‌లో వనపర్తి జట్టుపై 1-0 తేడాతో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. రేపు జరిగే ఫైనల్స్‌లో నిజామాబాద్ జట్టుతో తలపడనుంది. జట్టు విజయం పట్ల జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలీ హర్షం వ్యక్తం చేశారు.

News February 22, 2026

NLG: కుమ్మెర జాతరలో శిశువు మృతిపై NHRCకి ఫిర్యాదు

image

కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. మర్రిగూడ మండలం కమ్మగూడెంకు చెందిన న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.

News February 22, 2026

NLG: SLBC ఘటన.. దొరకని ఆరుగురి ఆచూకీ

image

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మట్టి దిబ్బల కిందే తమ వారు కలిసిపోయారన్న వేదనలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు.