News March 9, 2025
NLG: రేపటి నుంచి ఇంటర్ పేపర్ వ్యాల్యూయేషన్

ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం ఈ నెల 10 నుంచి ప్రారంభం కానుందని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ దస్రూనాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ 10న సంస్కృతం పేపర్ మూల్యాంకనం ప్రారంభమవుతుందని, మిగిలిన సబ్జెక్టులు ఈ నెల 20, 22, 26న ప్రారంభమవుతాయన్నారు. బోర్డు ఆదేశాల మేరకు పటిష్ఠంగా మూల్యాంకన ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News March 9, 2025
నల్గొండ: సీపీఐకి ఒక ఎమ్మెల్సీ స్థానం

కాంగ్రెస్ అధిష్ఠానం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ప్రకటిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. వీరి ఎంపిక పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఒక ఎమ్మెల్సీ సీటును కాంగ్రెస్ సీపీఐకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఎమ్మెల్సీ పేరును సీపీఐ ప్రకటించాల్సి ఉంది.
News March 9, 2025
నల్గొండ: అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ కోటాలో ఆయన పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పేరు ప్రకటించడంపై ఆయన అభిమానులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 9, 2025
నల్గొండ: ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ ఫైనల్..!

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ కోటాలో ఆయన పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శంకర్ నాయక్‌కు మిర్యాలగూడ, హుజూర్‌నగర్, నాగార్జున సాగర్ గిరిజన తండాల్లో పట్టుంది. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.