News September 6, 2025
NLG: రేపు నల్గొండలో బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు

ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 7న జిల్లాకేంద్రంలోని HYD రోడ్డు విద్యుత్ పోల్ సెంటర్ క్రీడామైదానంలో నిర్వహించనున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అనిశెట్టి బయ్యన్న తెలిపారు. జనగామ జిల్లాలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించే అంతర్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో ఎంపికైన క్రీడా జట్లు పాల్గొంటాయని తెలిపారు.
Similar News
News September 6, 2025
రేపు కామారెడ్డిలో ముఖ్య కార్యకర్తల సమావేశం: షబ్బీర్ ఆలీ

రేపు కామారెడ్డిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వేదిక పైనే, అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేసుకుని సంబరాలు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈనెల 15న కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో రేపు సన్నాహక సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.
News September 6, 2025
పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? పెద్ద తప్పు చేస్తున్నారు!

పిల్లల ఏడుపును మాన్పించేందుకు, ఆహారం తినిపించేందుకు కొందరు వారికి ఫోన్ ఇస్తుంటారు. కొందరైతే తమ పిల్లలు సొంతగా యూట్యూబ్ వాడితే ఖుషీ అవుతుంటారు. కానీ పిల్లలకు ఫోన్ ఇవ్వడం మంచిది కాదని మానసిక వైద్యుడు శ్రీకాంత్ అంటున్నారు. ‘పిల్లల మెదడు ఎంత మొబైల్ చూస్తే అంత మొద్దుబారుతుంది. ఇంట్లో ఎన్ని తక్కువ బొమ్మలుంటే అంత చురుకవుతుంది. పేరెంట్స్ ఎన్ని మాటలు, కథలు చెప్తే అంత పదునవుతుంది’ అని తెలిపారు.
News September 6, 2025
జగిత్యాల: ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్‌జెండర్‌లు..!

జగిత్యాల జిల్లా పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జనోత్సవం బందోబస్తులో ట్రాన్స్‌జెండర్లతో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. HYD తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమైన ప్రజాసేవ కార్యక్రమ బాధ్యతల్లో ట్రాన్స్‌జెండర్‌లను భాగం చేసిన రెండో జిల్లాగా JGTL నిలిచిందని SP అశోక్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా 11మంది ట్రాన్స్‌జెండర్‌లను నియమించుకోవడంతో సమాజంలో ప్రతి వర్గానికి సమానత్వం, గౌరవం దక్కుతుందని ఆయన అన్నారు.