News July 22, 2024

NLG: రేబిస్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రణాళిక

image

ఉమ్మడి జిల్లాను రేబిస్ రహిత జిల్లాగా మార్చేందుకు పశు సంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ప్రణాళిక సిద్ధం చేశాయి. ఉమ్మడి జిల్లాలో 1.10 లక్షలకు పైగా వీధి కుక్కలు, పదివేలకు పైగా పెంపుడు కుక్కలు ఉన్నాయి. రేబిస్ నివారణకు అవసరమైన డయాగ్నస్టిక్ ల్యాబ్లను ఏర్పాటు చేనున్నట్లు తెలిసింది. ఈ ల్యాబ్‌ల్లో యాంటీ రేబిస్ ఎలిమినేషన్‌పై పరీక్షలు నిర్వహిస్తారు.

Similar News

News November 6, 2024

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సర్వం సిద్ధం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

 సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల కుటుంబాల వివరాల సేకరణకు గాను ఎన్యుమరేటర్లను, సూపర్‌వైజర్లను నియమించడమే కాకుండా, వారికి శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామని ఆమె వెల్లడించారు.

News November 5, 2024

SRPT: యువకుడి ఆత్మహత్య

image

కోదాడ మండలం కూచిపూడి తండాలో సాయి భగవాన్ అనే యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విషయంలో మాట్లాడదామని పిలిచి యువకుడిపై యువతి బంధువులు దాడి చేశారని యువకుడి బంధువులు ఆరోపించారు. అవమాన భారం తట్టుకోలేక పురుగుల మందు తాగి సాయి భగవాన్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 5, 2024

SRPT: మద్యం సేవించి పాఠశాలకు వచ్చిన టీచర్ సస్పెండ్

image

మోతె మండలం రామాపురం ప్రాథమిక పాఠశాల <<14534111>>ఉపాధ్యాయుడు ఉపేందర్ మద్యం సేవించి<<>> పాఠశాలకు వస్తున్నాడని స్థానికులు, అధికారులకు ఫిర్యాదు చేయగా వారు స్పందించారు. ఉపేందర్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులను మండల విద్యాధికారి ద్వారా సంబంధిత ఉపాధ్యాయుడికి అందజేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.