News August 31, 2025
NLG: రేషన్ డీలర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్

రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించి డీలర్లకు రూ.2 కోట్ల కమీషన్‌ను శనివారం విడుదల చేసింది. జిల్లాలో 997 రేషన్ షాపులు ఉండగా వాటి ద్వారా 5,28,309 కుటుంబాలకు రేషన్ అందుతోంది. రేషన్ పంపిణీ చేసినందుకు గాను మొత్తం రూ.140 (రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.90, కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.50) కమీషన్ రూపంలో డీలరుకు అందుతుంది.
Similar News
News September 1, 2025
నల్గొండ: ప్రజావాణిలో 99 ఫిర్యాదులు

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 99 ఫిర్యాదులు అందాయని, వాటిలో 30 జిల్లా అధికారులకు, 69 రెవెన్యూ శాఖకు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
News September 1, 2025
NLG: వీధి కుక్కలపై ప్రచారం.. కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్

వీధి కుక్కల బెడదను నివారించేందుకు మున్సిపల్, గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆమె సంబంధిత అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఆర్‌డీఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. తద్వారా ఈ సమాచారం వారి కుటుంబాలకు చేరుతుందని ఆమె పేర్కొన్నారు.
News September 1, 2025
NLG: జిల్లాలో పరిషత్ ఎన్నికల సందడి

పరిషత్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతుంది. జిల్లాలో పోలింగ్ కేంద్రాలు వాటి స్థితిగతులను పరిశీలించి జాబితా రూపకల్పన చేసి నివేదికలను ఉన్నత అధికారులకు పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో 33 ఎంపీపీలు, 353 ఎంపీటీసీ, 31 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. కలెక్టర్ ఆమోదంతో పోలింగ్ స్టేషన్లో తుది జాబితాను ఎంపీడీవోలు ప్రచురించనున్నారు.