News October 8, 2024

NLG: లైంగిక దాడి ఘటనలో నిందితుడి అరెస్టు

image

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిని చండూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వాటుపల్లి బాబీ (24) కొన్ని రోజుల క్రితం తాపీ పనులు చేసేందుకు మండలంలోని ఓ గ్రామానికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఓ బాలికకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు సీఐ వెంకటయ్య తెలిపారు.

Similar News

News September 15, 2025

ఏడాదిలో 19 మందిపై పోక్సో కేసులో శిక్ష: నల్గొండ ఎస్పీ

image

గడిచిన సంవత్సరంలో నల్గొండ జిల్లాలో పోక్సో చట్టం కింద 18 కేసులలో 19 మంది నిందితులకు శిక్ష పడిందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మైనర్ బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కేసులలో సకాలంలో సాక్ష్యాధారాలు సేకరించి, ఛార్జిషీట్ దాఖలు చేసి, నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

News September 15, 2025

NLG: దసరా వస్తోంది.. జీతాలేవీ..?

image

NLG జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రామాలు స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను తమపై వేసుకుని జిల్లాలో 868 జీపీల్లో పనిచేసే కార్మికుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. తక్కువ జీతం సైతం సకాలంలో రాక కుటుంబ పోషణకు అప్పులు చేస్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగ సమీపిస్తుండడంతో నూతన వస్త్రాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేద్దామంటే చేతిలో డబ్బులు లేక దిక్కులు చూస్తున్నారు.

News September 15, 2025

NLG: దొడ్డు బియ్యంపై మౌనమేల?

image

NLG జిల్లాలోని రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. జిల్లాలో గోదాములు, MLS పాయింట్లతో పాటు రేషన్ షాపుల్లో 6వేల మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాటిని ఏం చేయాలో తెలియక రేషన్ డీలర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు. దొడ్డు బియ్యం నుంచి పురుగులు సన్నబియ్యానికి పడుతున్నాయని లబ్ధిదారులు అంటున్నారు.