News April 17, 2025
NLG: వానాకాలం సాగు అంచనా 11.60 లక్షల ఎకరాలు!

వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. దీనికి అవసరమైన ఎరువులు, విత్తనాల ప్రతిపాదనలు కూడా ఖరారు చేసిన వ్యవసాయ శాఖ.. కమిషనరేట్‌కు పంపించింది. గత వానాకాలంలో 11,50,556 ఎకరాల్లో వరి, పత్తి, ఇతర పంటల సాగు కాగా ప్రస్తుత వానాకాలంలో అదనంగా సుమారు 10 వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేసింది. ప్రస్తుత వానాకాలంలో 11,60,389 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు ప్రణాళిక ఖరారు చేసింది.
Similar News
News November 6, 2025
నల్గొండ: సోదరిని చూసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడని చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా.. SRPT జిల్లా కేసారానికి చెందిన సువర్ణ రాజు (19), గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని చూడడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. చిట్యాల దాటాక అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనగా బలమైన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై తండ్రి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 6, 2025
నల్గొండ: దూడకు రెండే కాళ్లు..!

తిప్పర్తి మండలం పజ్జూరులో రైతు జంజీరాల గోపాల్‌కు చెందిన గేదె రెండు కాళ్ల దూడకు జన్మనిచ్చింది. దూడకు కేవలం ముందు కాళ్లు మాత్రమే ఉన్నాయని, వెనుక కాళ్లు లేవని రైతు తెలిపారు. దూడ ఆరోగ్యంగానే ఉందని ఆయన చెప్పారు. ఈ దూడను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు.
News November 6, 2025
మిర్యాలగూడ: 100 గొర్రెలు మృతి

100 గొర్రెలు ఆకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వేములపల్లి మండలంలో జరిగింది. పెన్ పహాడ్ మండలానికి చెందిన గొర్ల కాపర్లు సైదులు, నాగరాజు, కోటయ్య, శ్రీరాములు, ఉపేందర్ మరో ఇద్దరు కలిసి గొర్లను మేపుకుంటూ నాలుగు రోజుల క్రితం వేములపల్లి శివారుకు చేరుకున్నారు. అక్కడే మేపుతుండగా ఒకేసారి గొర్లు చనిపోయాయని కాపర్లు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


