News November 20, 2025

NLG: వామ్మో కోతులు

image

జిల్లాలో కోతుల బెడద కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగుబడులు గణనీయంగా తగ్గడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలాకాలంగా వానరాలతో అటు రైతులు, ఇటు ప్రజలు సతమతమవుతున్నారు. రోజూ వేలాది కోతులు కూరగాయలు, పండ్ల తోటలు, పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తూ రైతులను ఇబ్బందుల్లో పడేస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.

Similar News

News April 3, 2026

NLG: ధాన్యం పక్కదారి.. మిల్లర్లపై చర్యలేవి?

image

నల్గొండ జిల్లాలో సిఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై ఇప్పటికీ కఠిన చర్యలు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. 2022-23 సీజన్‌కు చెందిన రూ.191.13 కోట్ల విలువైన 5,89,533 క్వింటాళ్ల ధాన్యాన్ని 7 మిల్లులు దుర్వినియోగం చేసినట్లు తనిఖీల్లో తేలింది. కేసులు నమోదు చేసినప్పటికీ రాజకీయ నాయకుల చొరవతో చర్యలు నెమ్మదిస్తున్నాయి. కేసులో ఇప్పటికే ఒకరు అరెస్ట్ కాగా, మరికొందరు కోర్టును ఆశ్రయించారు.

News April 3, 2026

NLG: నామినేటెడ్ ‘కొలువు’లకై.. ఎదురుచూపులు!

image

జిల్లాలో అధికార కాంగ్రెస్ శ్రేణుల్లో నామినేటెడ్ పదవుల సందడి నెలకొన్నా, ఆశావహులకు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు గడుస్తున్నా, జిల్లా స్థాయి కార్పొరేషన్లు, కమిటీల భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసి.. ఇప్పుడు తమకు గుర్తింపు దక్కడం లేదని అంతర్గతంగా మదన పడుతున్నారు.

News April 3, 2026

నల్గొండ: నకిలీ విత్తనాలపై ‘స్పెషల్ ఆపరేషన్’

image

వానాకాలం సాగు వేళ నకిలీ పత్తి విత్తనాల విక్రయదారుల ఆట కట్టించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 5.13 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేయగా, ఇందుకోసం సుమారు17 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు గుర్తించారు. విడి విత్తనాల అక్రమ రవాణాను అరికట్టేందుకు త్రిముఖ వ్యూహంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వ్యాపారుల కదలికలపై నిరంతర నిఘా ఉంచనున్నారు.