News September 2, 2025
NLG: విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని HRC ఆదేశం

నల్గొండలోని నలంద ఫార్మసీ కళాశాల యాజమాన్యం తమకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ షమీమ్ అక్తర్, బీ ఫార్మసీ పూర్తి చేసిన విద్యార్థులకు వారి టీసీ, ఇతర సర్టిఫికెట్లను వెంటనే అందజేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News September 2, 2025
అంచనాలు రూపొందించి సమర్పించాలి : కలెక్టర్

ఇటీవల కురిసిన భారీ వర్షాలు వల్ల దెబ్బతిన్న రహదారులకు సంబంధించి అంచనాలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి R&B అధికారులను ఆదేశించారు. సోమవారం CM రేవంత్ రెడ్డి HYD నుంచి వర్షాలు, వరద నష్టాలపై కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు R&B రహదారులు దెబ్బతిన్నాయని కలెక్టర్ వివరించారు.
News September 1, 2025
గ్రీవెన్స్ డేలో 54 మంది అర్జీలు స్వీకరించిన ఎస్పీ

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 54 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగే విధంగా పనిచేయాలని ఆదేశించారు.
News September 1, 2025
వీధి కుక్కలపై అధికారులతో కలెక్టర్ కాన్ఫరెన్స్

వీధి కుక్కల వల్ల కలిగే నష్టాలు, వీధి కుక్కల స్టెరిలైజేషన్, వాక్సినేషన్, భర్త కంట్రోల్ తదితర అంశాలపై ప్రజలకు, విద్యార్థులకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఇతర శాఖల సంబంధిత అధికారులతో ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు సమన్వయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుక్కలన్నింటికీ వ్యాక్సినేషన్ వేయించాలని సూచించారు.