News October 11, 2025

NLG: వీలైనంత త్వరగా ధాన్యం ఎగుమతి చేయాలి: కలెక్టర్

image

నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతుల ధాన్యాన్ని వీలైనంత త్వరగా ఎగుమతి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో వెంకటేష్, డీసీవో పత్యా నాయక్, ఎంఏవో శ్రీనివాస్, సీఈవో అనంతరెడ్డి, మానిటరింగ్ అధికారి రాము తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 11, 2025

NLG: సోమవారం నుంచే ప్రజావాణి: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

ఎన్నికల కోడ్ తొలగింపు నేపథ్యంలో, వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్‌ను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో, జిల్లా యంత్రాంగం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

News October 10, 2025

NLG: రెసిడెన్షియల్ పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్

image

నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్‌ఎల్‌బీసీ కాలనీలోని మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆర్డీఓ వై. అశోక్ రెడ్డితో కలసి పరిశీలించిన కలెక్టర్.. పాఠశాలలో సరైన వసతులు లేకపోవడంపై ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను వెంటనే కల్పించాలని ఆమె ఆదేశించారు.

News October 10, 2025

NLG: మిగిలింది 8 రోజులే….!

image

మద్యం టెండర్ల ప్రక్రియ ప్రారంభమై 14 రోజులు గడిచిపోయింది. ఇక టెండర్లు వేసేందుకు కేవలం 8 రోజుల గడువే ఉంది. అయితే ఈ నెల 18వ తేదీ గడువులోగా టెండర్లు వేగం చేసేందుకు అధికారులు కూడా వ్యాపారులను మోటివేట్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం డిపాజిట్ ధర పెంచడంతో కొందరు వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కలిసి ఒక టెండర్‌ను వేసే ధోరణిలో ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.