News March 28, 2025

NLG: సంక్షోభంలో పౌల్ట్రీ రంగం 

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్‌ఫ్లూ.. పౌల్ట్రీ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఇప్పటికే కొన్ని రోజులుగా కోళ్లు మృతి చెందుతుండడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. బర్డ్‌ఫ్లూ కారణంగా 90 శాతం ప్రజలు చికెన్ తినడం మానేశారు. ఫలితంగా సదరు కోళ్ల కంపెనీ నిర్వాహకులు పౌల్ట్రీ రైతులకు కోడి పిల్లలు ఇవ్వడం పూర్తిగా మానేశారు. దీంతో వందలాది కోళ్ల ఫామ్ లకు తాళాలు పడ్డాయి.

Similar News

News March 31, 2025

NLG: వ్యవసాయశాఖలో కొత్త ఫోన్ నంబర్లు

image

నల్గొండ జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫోన్ నంబర్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని JDA శ్రవణ్ కుమార్ తెలిపారు.
☞జిల్లా వ్యవసాయధికారి – 8977751294
☞NLG ADA–T(DAO) – 8977751295
☞NLG ADA – 8977751449
☞DVK ADA – 8977751306
☞MLG ADA – 8977751358
☞హాలియా ADA -8977751330
☞మునుగోడు ADA – 8977751370
☞నకిరేకల్ ADA – 8977751427
☞DDAFTC నల్గొండ – 8977751458

News March 31, 2025

నాంపల్లి: జాతీయ కమిషన్ సభ్యుడిగా శ్రీనివాస్ నియామకం

image

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ, వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ నాంపల్లి మండల కేంద్రానికి చెందిన శిరందాసు శ్రీనివాస్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వైద్య అనుబంధ వృత్తుల జాతీయ కమిషన్ సభ్యుడిగా ఎన్నికైయ్యారు. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఉన్నత శిఖరాలు అధిరోహించిన శిరందాసు శ్రీనివాస్‌కి నాంపల్లి మండల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.

News March 30, 2025

NLG: జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉగాది విషెష్

image

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని నల్గొండ జిల్లా ప్రజలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని శుభాలు కలగాలని.. సుభిక్షంగా ఉండాలని పల్లెల్లో పట్టణాల్లో ప్రతి ఇల్లు కళకళలాడాలని పేర్కొన్నారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని అభిలాషించారు.

error: Content is protected !!