News September 16, 2025
NLG: సంత.. సౌకర్యాలు లేక చింత

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీల్లో నిర్వహించే సంత స్థలాల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కట్టంగూర్, గురజాల, అమ్మనబోలు, NKP, చింతపల్లి, కొండమల్లేపల్లి, గొడకళ్ల, త్రిపురారం, కొండమడుగు, నెమ్మికల్, తుంగతుర్తి, అర్వపల్లి, ఆత్మకూర్ (ఎం), వలిగొండ, రామన్నపేటలో సంతలు జరుగుతాయి. సంత స్థలాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, పార్కింగ్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News September 16, 2025
ప్రసారభారతిలో ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని <
వెబ్‌సైట్: https://prasarbharati.gov.in/
News September 16, 2025
నిర్మల్ జిల్లా వర్షపాతం వివరాలు

గడిచిన 24 గంటలలో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 397.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా నర్సాపూర్ మండలంలో 46.8, సోన్ 44, కడెం పెద్దూర్ 39.4, మామడ 30, దిలావర్పూర్ 32.4, బైంసా 28.2, ముధోల్ 19.6, లోకేశ్వరం 21.6, నిర్మల్ మండలాలలో 11.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో జిల్లాలో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.
News September 16, 2025
డిగ్రీ విద్యార్థులకు అలర్ట్..రేపటితో ముగియనున్న గడువు

ఎన్టీఆర్: కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన యూజీ(హానర్స్) 8వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ.800 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ పి.వీరబ్రహ్మచారి సూచించారు.