News August 27, 2025
NLG: సకాలంలో అందని వేతనం.. భారంగా పోషణ

జిల్లాల్లోని పొరుగు సేవల ఉద్యోగులు వేతనాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతోందని చెబుతున్నారు. ఉభయ జిల్లాల్లో సుమారు 7 వేల మంది పొరుగు సేవల ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తుంది. సకాలంలో వేతనాలు అందకపోవటంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News August 27, 2025
NLG: అదనపు రుణం ఎక్కడ..?

జిల్లాలో అదనపు రుణం అందక ఇందిరమ్మ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో కలిసి ఇప్పటి వరకు 12,064 ఇళ్లు మంజూరయ్యాయి. ఆర్థికంగా చేయూతనివ్వడం కోసం స్వయం సహాయం సంఘాల మహిళలు లబ్ధిదారులుగా ఉంటే రూ.లక్ష అదనంగా రుణం అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ పూర్తిస్థాయిలో ఇప్పటి వరకు అమల్లోకి రావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News August 27, 2025
NLG: ‘ఇన్ స్పైర్ మనక్’పై ఆసక్తి ఏది?!

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు ‘ఇన్ స్పైర్ మనక్’ చక్కటి వేదికగా నిలుస్తోంది. విద్యార్థులు భావిభారత శాస్త్రవేత్తలు ఎదిగేందుకు కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా శాస్త్రసాంకేతిక శాఖ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలో విద్యార్థులతో నామినేషన్లు చేయించేందుకు HMలు, ఉపాధ్యాయులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది.
News August 27, 2025
NLG: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ కీలక ఆదేశం.!

గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన పనులు వేగవంతం అయ్యాయి. ఓటర్ల జాబితాతోపాటు పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. అందుకు అనుగుణంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ మేరకు అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారులు, ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు.