News December 31, 2025

NLG: సబ్ కలెక్టర్ బదిలీ ఉత్తర్వులు రద్దు.. డీపీఓ బదిలీ

image

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ బదిలీ ఆగిపోయింది. ఆయన్ను నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్‌గా నియమించినట్లు ఈనెల 25న వెలువడిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ బదిలీ ప్రక్రియ రద్దు చేయడంతో మిర్యాలగూడ సబ్ కలెక్టర్‌గా ఆయన యథావిధిగా కొనసాగనున్నారు. కాగా నల్గొండ డీపీఓ వెంకయ్యను ములుగు జిల్లా డీపీఓగా బదిలీ చేశారు.

Similar News

News January 5, 2026

NLG: అమ్మ బాబోయ్.. కేజీ రూ.300లా!

image

నల్గొండ జిల్లాలో చికెన్ రేటు ట్రిపుల్ సెంచరీ కొట్టింది. కిలో మాంసం రూ.300కి చేరడంతో మాంసం ప్రియులు బెంబేలెత్తుతున్నారు. గుడ్డు ధర రూ.8.50 ఉండగా.. లైవ్ కోడి రూ.185, స్కిన్‌లెస్ రూ.290-310 పలుకుతోంది. బర్డ్ ఫ్లూతో ఉత్పత్తి తగ్గిందని, అందుకే రేట్లు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. పండగ పూట ముక్క లేకపోతే ఎలా అని మాంసం ప్రియులు వాపోతుండగా, రేట్లు ఇప్పట్లో దిగిరావని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

News January 5, 2026

NLG: టెట్ అభ్యర్థులకు తప్పని తిప్పలు

image

టెట్ అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపు ఇబ్బందిగా మారింది. మొదటి రోజే అప్లై చేసినా, ప్రాధాన్యత క్రమంలోని చివరి పట్టణాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. జిల్లా నుంచి 1,557 మంది ఉపాధ్యాయులతో సహా సుమారు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన పరీక్షలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

News January 5, 2026

నల్గొండలో జిల్లాలో బీసీ వర్సెస్ రెడ్డి

image

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ ఏర్పాటు వ్యవహారం పార్టీలో సెగలు పుట్టిస్తోంది. అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నియామకం తర్వాత కమిటీ కూర్పుపై కసరత్తు మొదలవ్వగా.. పదవుల కోసం ఆశావాహులు భారీగా క్యూ కడుతున్నారు. ప్రధానంగా రెడ్డి, బీసీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ‘హస్తం’ రాజకీయాలను వేడెక్కిస్తోంది. సామాజిక సమీకరణల మధ్య సమతూకం పాటించడం అధిష్ఠానానికి కత్తిమీద సాములా మారింది.