News August 27, 2025
NLG: సాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం

సాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో వరుసగా గేట్లను మూసివేస్తున్నారు. 26 రేడియల్ క్రస్ట్ గేట్లకు గాను 12 క్రస్ట్ గేట్లను మూసి వేశారు. ప్రస్తుతం 14 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,61,971 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి దిగువ కృష్ణానదిలోకి స్పిల్వే మీదుగా 1,07,338 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Similar News
News August 27, 2025
HYDకు ఆరెంజ్ అలెర్ట్.. అనవసరంగా బయటకు వెళ్లకండి!

నగర వ్యాప్తంగా అనేక చోట్ల ఇప్పటికే వర్షం కురుస్తోంది. దాదాపు ఒంటిగంట వరకు వర్షం కొనసాగే అవకాశం ఉన్నట్లు బేగంపేట్ వాతావరణశాఖ తెలిపింది. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లితో సహా రంగారెడ్డిలోని రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాలకూ ఆరెంజ్ అలెర్ట్ ఉందని, అవసరమైతే కానీ బయటకు వెళ్లొద్దని సూచించారు.
News August 27, 2025
ఉపాధి అవకాశాలకు ఊతమిచ్చే పీఎంవీబీఆర్‌వై: డీఆర్ఎం

గుంటూరులో రైల్ వికాస్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో రైల్వే డీఆర్ఎం సుధేష్ణ సేన్ మాట్లాడారు. ప్రధాన మంత్రి విక్సిత్ భారత్ రోజ్ గార్ యోజన పథకం యజమానులను కొత్త ఉద్యోగులను నియమించడానికి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ పథకం కింద కేంద్రం నిర్దిష్ట కాలం వరకు ఉద్యోగులకు, యజమానులకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తుందని చెప్పారు. దీతో యజమానుల భారం తగ్గి, కొత్త ఉద్యోగావకాశాలు సృష్టించబడతాయని అన్నారు.
News August 27, 2025
GNT: ‘పంచాయతీ అభివృద్ధి సూచికతో పారదర్శకత పెరుగుతుంది’

గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయతీ అభివృద్ధి సూచికపై శిక్షణా కార్యక్రమం జరిగింది. జెడ్పీ ఛైర్‌పర్సన్ హెనీ క్రిస్టీనా మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల పురోగతిని అంచనా వేసి, డేటా ఆధారిత పాలనకు ఈ సూచిక దోహదం చేస్తుందని తెలిపారు. సీఈఓ వీర్ల జ్యోతిబసు మాట్లాడుతూ.. స్థానిక స్థాయిలో 9 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై పనితీరు కొలవడంలో ఇది కీలకమని, పారదర్శకత పెరగటంతో ప్రజలకు స్పష్టత లభిస్తుందన్నారు.