News February 16, 2025

NLG: సుదీర్ఘ నిరీక్షణకు తెర!

image

డీఎస్సీ 2008లో నష్టపోయిన బీఈడీ అభ్యర్థులకు కాంట్రాక్టు విధానంలో ఎస్జీటీలుగా వారం రోజుల్లోగా నియామకాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి AP రాష్ట్రంలో నోటిఫికేషన్ అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు 30 శాతం పోస్టులు ప్రత్యేకంగా D.Ed అభ్యర్థులకు కేటాయించడంతో B.Ed అభ్యర్థులు నష్టపోయారు. 17 ఏళ్ల వారి న్యాయ పోరాటానికి హైకోర్టు తెరదించింది.

Similar News

News February 22, 2026

NLG: కుమ్మెర జాతరలో శిశువు మృతిపై NHRCకి ఫిర్యాదు

image

కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్ష కారణంగా రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది. మర్రిగూడ మండలం కమ్మగూడెంకు చెందిన న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఈ ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులను విధుల నుంచి తొలగించాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.

News February 22, 2026

NLG: SLBC ఘటన.. దొరకని ఆరుగురి ఆచూకీ

image

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం కూలిన భారీ ప్రమాదానికి నేటితో ఏడాది పూర్తయింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద భూగర్భ ప్రమాదంగా నిలిచిన ఈ ఘటనలో జయప్రకాశ్ ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆరుగురి ఆచూకీ నేటికీ లభ్యం కాకపోవడం వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మట్టి దిబ్బల కిందే తమ వారు కలిసిపోయారన్న వేదనలో బాధితులు కొట్టుమిట్టాడుతున్నారు.

News February 22, 2026

NLG: ఈనెల 27 వరకు పెన్షన్ల పంపిణీ: డీఆర్డీవో

image

ఆసరా పింఛన్లను 27వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో శేఖర్ రెడ్డి తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళలకు చేయూత, ఆసరా పింఛన్లను ఆయా పోస్టాఫీసులలో అందజేయనున్నట్లు తెలిపారు. పింఛనుదారులు పింఛను మొత్తం నేరుగా సంబంధిత పోస్టల్ కార్యాలయాల్లో పొందాలని, దళారులను నమ్మవద్దని పేర్కొన్నారు.