News August 29, 2025
NLG: సెప్టెంబర్ 4 వరకు పింఛన్ల పంపిణీ

జిల్లాలో చేయూత పింఛన్లను సెప్టెంబర్ 4వ తేదీ వరకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి తెలిపారు. ముఖ గుర్తింపు సాఫ్ట్వేర్ ద్వారా పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్టు తెలిపారు. పెన్షన్ దారులంతా రూ.16 చిల్లరను అడిగి తీసుకోవాలని పేర్కొన్నారు. మధ్య దళారులను నమ్మకూడదని సూచించారు.
Similar News
News August 29, 2025
మర్డర్ కేసు ఛేదించిన నల్గొండ పోలీసులు

NLGలో జరిగిన <<17539485>>మర్డర్ <<>>కేసును వన్ టౌన్ CI ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి బృందం 24 గంటలు గడవకముందే ఛేదించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన లారీ క్లీనర్ షేక్ సిరాజ్.. రమేశ్‌ను హత్య చేసినట్లు DSP శివరాంరెడ్డి వెల్లడించారు. సిరాజ్ రోజూ పడుకునే ప్లేస్‌లో రమేశ్ పడుకోవడంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ బండరాళ్లతో కొట్టి హత్య చేశాడన్నారు. కేసు ఛేదించిన బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.
News August 29, 2025
NLG: నైపుణ్య విద్య.. రేపటి వరకే చాన్స్!

గ్రామీణ విద్యార్థుల్లో సాంకేతిక ప్రతిభను వెలికి తీసేందుకు నల్గొండలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. నైపుణ్య విద్యలో శిక్షణ పొందేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకొనే అవకాశం కల్పించింది. రేపటి వరకు చాన్స్ ఉన్నందున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ కోరుతున్నారు.
News August 29, 2025
NLG: ముసాయిదా ఓటరు జాబితా విడుదల

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటరు జాబితా విడుదలైంది. తుది ఓటరు జాబితా తయారీకి విడుదల చేసిన నోటిఫికేషన్ ఆధారంగా జిల్లాలోని 869 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాలను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య గురువారం జాబితాను విడుదల చేశారు.