News July 19, 2024
NLG: సైబర్ నేరగాళ్ల ఘరానా మోసం

సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. చండూరుకు చెందిన వీరమళ్ళ నాగరాజు ఎలక్ట్రికల్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఫోన్‌కి ఉదయం ఓ లింక్ వచ్చింది. క్లిక్ చేయడంతో వెంటనే అకౌంట్ నుంచి రెండు దఫాలుగా లక్ష రూపాయలు డెబిట్ అయినట్టు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రుణమాఫీ నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News August 25, 2025
NLG: రూ.50 కోట్లకు పైగా బకాయిలు..!

జిల్లాలో విద్యార్థులకు చదువులు భారంగా మారుతున్నాయి. నాలుగేళ్లుగా విద్యార్థుల బోధనా ఫీజుల బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. ప్రభుత్వంపై నమ్మకంతో ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ వంటి కోర్సుల్లో చేరిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో రూ.50 కోట్లకు పైగానే బకాయిలు పేరుకుపోయాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి, బకాయిలు చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు.
News August 25, 2025
NLG: జూనియర్లకు ఎఫ్ఆర్ఎస్.!

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బందికి అమలులో ఉన్న ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ను ఇప్పుడు విద్యార్థులకు కూడా విస్తరించారు. ఉమ్మడి జిల్లాలోని 31 కళాశాలలో ఈ నెల 23 నుంచి విద్యార్థుల హాజరును పర్యవేక్షించేందుకు AI ఆధారిత ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో రిజిస్టర్ ద్వారా హాజరు నమోదు జరిగేది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా విద్యార్థుల హాజరును కచ్చితంగా ట్రాక్ చేస్తున్నారు.
News August 25, 2025
NLG: ఆ శాఖలో 134 పోస్టులు ఖాళీ..!

నల్గొండ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, ఉద్యోగుల కొరతతో కొట్టుమిట్టాడుతుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీలలో 342 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా, కేవలం 208 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇంకా 134 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో నిత్యం పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.