News February 3, 2025
NLG: స్థానిక సమరానికి వడివడిగా అడుగులు
NLG జిల్లాలో స్థానిక సమరానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల బీసీ కుల గణన పూర్తి కావడం, ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం, తర్వాత క్యాబినెట్‌లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటారనే సమాచారంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. నల్గొండ జిల్లాలో 856 గ్రామపంచాయతీలు, 7392 వార్డులు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించనున్న రిజర్వేషన్ల వైపు ఆశగా చూస్తున్నారు.
Similar News
News February 3, 2025
నల్గొండ: రేపటి నుంచి స్తంభగిరి బ్రహ్మోత్సవాలు
మర్రిగూడ మండల పరిధిలోని సరంపేట గ్రామ శివారులో గల స్తంభగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతాయని ఆలయ అర్చకులు మారేపల్లి నర్సింహా చార్యులు తెలిపారు. 8న రాత్రి కళ్యాణం, 12న రథోత్సవం జరుగుతుందని చెప్పారు. మండలంలోని చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు వస్తారన్నారు.
News February 3, 2025
మాంచెస్టర్ అమ్మాయితో చిట్యాల అబ్బాయి పెళ్లి
చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన రాజీవ్ రెడ్డి యూకేలోని మాంచెస్టర్ చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. ఆయన మాంచెస్టర్లో హోటల్ మేనేజెమెంట్ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పోలీస్ శాఖలో పనిచేస్తున్న లారెన్ ఫిషర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. పలువురు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
News February 3, 2025
NLG: చేనేత కళాకారుల జీవన విధానంపై సినిమా
పోచంపల్లి చేనేత కళాకారుల జీవన విధానంపై ఓ సినిమా రూపొందుతోంది. చౌటుప్పల్‌కి చెందిన వ్యాపారవేత్త ధనుంజయ నిర్మాతగా, పోచంపల్లికి చెందిన బడుగు విజయకుమార్ దర్శకత్వంలో ది అవార్డ్ 1996 అనే సినిమా తీస్తున్నారు. నిర్మాత సురేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసినట్లు ధనుంజయ తెలిపారు. ఈ సినిమా మొత్తం గ్రామాల్లో చేనేత కళాకారుల జీవన విధానం, వారు దళారుల చేతిలో ఎలా మోసపోతున్నారో తెలిపే విధంగా ఉంటుందన్నారు.