News August 21, 2025
NLG: హర్పాల్ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడానికి ఇరిగేషన్ శాఖ సలహాదారుడిగా మాజీ లెఫ్ట్‌నెంట్ జనరల్ హర్పాల్ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డిఫెన్స్ ఇంజినీరింగ్ విభాగంలో 40 ఏళ్ల అనుభం కలిగిన ఆయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. ఎలాంటి జీతభత్యాలు తీసుకోకుండా ఆయన సేవలందిస్తారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ అభ్యర్థన మేరకు తెలంగాణలో పనిచేయడానికి ఆయన అంగీకరించారు.
Similar News
News August 22, 2025
పల్నాడు కలెక్టర్‌తో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు సహా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP), ఎంఐ ట్యాంకులు & గ్రౌండ్ వాటర్, జిల్లా జువెనైల్ జస్టిస్ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
News August 22, 2025
శ్రీకాకుళం జిల్లాలో టుడే న్యూస్ ఇవే..!

జిల్లాలోని పలు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల వద్ద అంగన్వాడీల నిరసన.
శ్రీకాకుళం జిల్లాకు మళ్లీ వర్షసూచన.
గణేష్ మండపాలపై అనుమతి తప్పనిసరి: జిల్లా ఎస్పీ.
బారువ: పర్యాటక ప్రాంతంపై పర్యవేక్షణ కరువు.
కోటబొమ్మాళి జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి.
దైవ దర్శనానికి వెళ్లినా తప్పుగా చిత్రీకరించారు: ఎమ్మెల్యే కూన.
కొత్తూరు: పీడిస్తున్న బురదనీటి సమస్య.
News August 22, 2025
పాక్‌ని కాపాడుతాం.. బుద్ధి బయట పెట్టిన చైనా

పాకిస్థాన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని చైనా ప్రకటించింది. ‘పరిశ్రమ, వ్యవసాయ, మైనింగ్ రంగాల్లో మా సపోర్ట్ ఉంటుంది. వారి సార్వభౌమాధికారం, ఉగ్రవాదంపై పోరులో మద్దతిస్తాం. పాక్‌కు ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగుతుంది’ అని చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ తెలిపారు. భారత్‌తో వాణిజ్యాన్ని ఆహ్వానిస్తూ.. పాక్‌కు మద్దతిస్తామనడం వెనుక చైనా అసలు బుద్ధి అర్థమవుతోందని విమర్శలు వస్తున్నాయి.