News March 20, 2025
NLG: 105 సెంటర్లలో రేపటి నుంచి పది పరీక్షలు

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 18,925 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు చెప్పారు. వీరిలో 18,666 మంది రెగ్యులర్, 259 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 986 మంది ఇన్విజిలేటర్లు, 6 లైన్స్ కార్డ్ బృందాలను ఏర్పాటు చేశారు
Similar News
News March 31, 2025
NLG: టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు

ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మిగతా ఆరుగురు మృతదేహాల కోసం గాలింపు చర్యలు నడుస్తున్నాయి. సహాయక పనులకు ఆటంకంగా ఉన్న స్టీల్‌ను తొలగిస్తూ లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ బయటికి తరలిస్తున్నారు. సొరంగం లోపల అత్యధికంగా ఉన్న మట్టిని తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నారు.
News March 31, 2025
NLG: వ్యవసాయ అనుసంధాన పనులకూ ‘ఉపాధి’

గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించారు. తాజాగా వ్యవసాయ అనుసంధాన పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధానంగా పంట పొలాల వద్దకు మట్టి రోడ్లు, పండ్ల తోటల పెంపకం, పశువుల కొట్టాలు, కోళ్లఫారాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. NLG జిల్లాలో సుమారు నాలుగు లక్షల జాబ్ కార్డులు ఉండగా.. సుమారు ఎనిమిది లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు.
News March 31, 2025
నల్గొండ జిల్లాలో భక్తిశ్రద్ధలతో.. ఈద్ ఉల్ ఫితర్

రంజాన్ పండుగను పురస్కరించుకుని నల్గొండ జిల్లాలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. పవిత్ర రంజాన్ పండుగను సోమవారం ముస్లింలు సంతోషంగా నిర్వహించుకున్నారు. మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వేల సంఖ్యలో పాల్గొన్నారు. మసీదు, ఈద్గాలు, తదితర చోట్ల వద్ద ప్రార్థనలకు భారీగా తరలివచ్చారు. నమాజు అనంతరం స్నేహితులు, బంధుమిత్రులు ఆలింగనాలు చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.