News August 4, 2024
NLG: 1,2 కాదు.. ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన నడ్డి గోపాలకృష్ణ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2018 డిసెంబర్లో పంచాయతీ కార్యదర్శి, 2019 నవంబర్లో రైల్వేలో గ్రూప్-డీ ఉద్యోగం, 2020లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై ప్రస్తుతం భువనగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా ప్రకటించిన టీజీపీఎస్సీ ఫలితాల్లో ఏఈఈ సివిల్ ఇంజినీర్ (గెజిటెడ్) ఉద్యోగం సాధించాడు.
Similar News
News September 16, 2024
ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో ఆదివారం భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, భూపాల్ రెడ్డి, బిక్షమయ్య గౌడ్, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్, చిరుమర్తి లింగయ్య, భాస్కరరావు, రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.
News September 15, 2024
త్రిపురారం: మాజీ ఎంపీపీ భర్తపై కత్తితో దాడి
త్రిపురారం మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ భర్త అనుముల శ్రీనివాస్ రెడ్డిపై ఆదివారం సాయంత్రం ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. తాగిన మైకంలో ఉన్న యువకుడు ఓ విషయంలో న్యాయం చేయలేదంటూ శ్రీనివాస్ రెడ్డి పై దాడి చేయడంతో కడుపులో రెండు చోట్ల గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాదు తరలించారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 15, 2024
నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా సాగర్ నిండింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా 312 టీఎంపీల నీరుంది. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో: 77,334 క్యూసెక్కుల నీరుంది.