News November 11, 2025
NLG: 13 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు

నల్గొండ మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయం UG I,III,V సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు నవంబర్ 13 నుంచి డిసెంబర్ 1 వరకు నిర్వహించనున్నారు. I సెమిస్టర్ 5400, III సెమిస్టర్ 5830, V సెమిస్టర్ 5597 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. నల్గొండ జిల్లాలో 12, సూర్యాపేట జిల్లాలో 09, యాదాద్రి భువనగిరి జిల్లాలో 09 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పరీక్షల కంట్రోలర్ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు.
Similar News
News November 11, 2025
అయ్యో పాపం.. ఆస్పత్రి ఆవరణలో అనాధగా పడి ఉన్న వృద్ధుడు

తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో ఓ వృద్ధుడు అనాధగా దీన స్థితిలో పడి ఉన్నాడు. ఎక్కడ నుంచి వచ్చాడో తెలీదు కానీ ఆస్పత్రి ప్రాంగణంలో ఆరు బయట నీరసించి పడి ఉండటం చూపురులను కలచివేస్తోంది. అనారోగ్యంతో బక్కచిక్కి ఉన్న ఆయన పరిస్థితి చూసి అటుగా వెళుతున్న వారు అయ్యో పాపం అంటున్నారే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు. వృద్ధుడికి యూరిన్ పైప్ అమర్చి ఉందని, మాట్లాడే స్థితిలో కూడా లేడని స్థానికులు చెబుతున్నారు.
News November 11, 2025
బిహార్‌లో NDA జయకేతనం: పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్

బిహార్‌లో BJP, JDU నేతృత్వంలోని NDA కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. 243 స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, NDAకి 133-159, మహాఘట్ బంధన్‌కు 75-101, ఇతరులకు 2-8 స్థానాలు, జన్ సురాజ్ పార్టీకి 0-5 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని వివరించింది. దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో మహాఘట్ బంధన్ కూటమిపై NDA పైచేయి సాధించనున్నట్లు తెలిపింది.
News November 11, 2025
MBNR: సౌత్ జోన్.. 27న వాలీబాల్ ఎంపికలు

పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా వర్సిటీలో పాల్గొనేందుకు వాలీబాల్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ PD డా.వై. శ్రీనివాసులు ‘Way2News’తో తెలిపారు. ఈనెల 27న వాలీబాల్(పురుషుల) జట్ల ఎంపికలు ఉంటాయని, వయస్సు 17-25లోగా ఉండాలన్నారు. ప్రస్తుతం చదువుతున్న క్రీడాకారులు బోనఫైడ్, టెన్త్ మెమో(కాలేజీ యొక్క ప్రిన్సిపల్ సంతకం)తో పాటు క్రీడా దుస్తులు ధరించి రావాలని, 26లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.


