News February 16, 2025

NLG: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

image

వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

Similar News

News October 16, 2025

CCI కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలి

image

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ ఎం.హరిత సూచించారు. 2025- 26 పత్తి కొనుగోళ్లపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సీసీఐ, వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా, పోలీస్, అగ్నిమాపక శాఖ తదితర శాఖలతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.

News October 16, 2025

కామారెడ్డి: రైల్వే ట్రాక్‌పై మహిళ మృతదేహం

image

కామారెడ్డి పట్టణ శివారులోని రైల్వే ట్రాక్‌పై గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది, ఉదయం రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళుతున్న కొందరు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

News October 16, 2025

NLG: దీపావళి ఆఫర్.. రూపాయికే సిమ్ కార్డ్

image

దీపావళి పండుగకు రూపాయికి బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. దీపావళి ప్రత్యేక పథకం ద్వారా ఒక్క రూపాయి ప్రీపెయిడ్ సిమ్ కార్డుతో నెల రోజుల పాటు అన్ని నెట్వర్క్‌కు అపరిమిత కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్ కొత్తగా ప్రీపెయిడ్ సిమ్ తీసుకునే వారికి వర్తిస్తుందన్నారు.