News February 16, 2025
NLG: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.
Similar News
News April 17, 2026
TU: ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలకు 97.95% విద్యార్థుల హాజరు

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని జరుగుతున్న ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/PCH) 8వ సెమిస్టర్ పరీక్షలకు 100% విద్యార్థులు హాజరైనట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. 97.95% విద్యార్థులు హాజరయ్యారన్నారు. 49 మంది విద్యార్థులకు 48 మంది విద్యార్థులు హాజరుకాగా ఒక్కరు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదని ఆయన తెలిపారు.
News April 17, 2026
కుప్పం కోర్టు ఉత్వర్వును సస్పెండ్ చేసిన హైకోర్టు

YCP ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, గిరిధర్‌రెడ్డికి హైకోర్టులో <<19667603>>ఎదరుదెబ్బ<<>> తగిలింది. CM చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో వీరి రిమాండ్‌ను తోసిపుచ్చుతూ కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.
News April 17, 2026
లక్షెట్టిపేట: జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వైద్యులు అవగాహన కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు విభాగాలను ఆయన పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ దిలీప్ పాల్గొన్నారు.


