News April 1, 2025
NLG: 2న SC సంఘం ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

షెడ్యూల్డ్ కులాల సంఘ ప్రతినిధులతో ఏప్రిల్ 2న నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5న భారత మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, 14న డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News April 3, 2025
NLG: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

‘పది’ పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా <<15971907>>తిరగాలని<<>> భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. నిన్న యాదాద్రి(D)లో ఈతకు వెళ్లి ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.
News April 3, 2025
NLG: 7 నుంచి పదో తరగతి పరీక్షల మూల్యాంకనం

పదో తరగతి పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 2న సాంఘిక శాస్త్రం పరీక్షతో పూర్తయ్యాయి. బుధవారం జరిగిన పరీక్షకు మొత్తం 18,666 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 18,628 మంది హాజరయ్యారు. 38 మంది గైర్హాజరయ్యారు. 99.79 శాతం హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. పదో తరగతి పరీక్షలు ముగియడంతో ఈ నెల 7వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం జరగనున్నది.
News April 3, 2025
NLG: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్‌మెన్ పోస్టులు ఉన్నాయన్నారు. ITI, డిప్లొమా, NCC కలిగిన వారికి బోనస్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. www. joinindianarmy.nic. వెబ్‌సైట్‌లో ఈ నెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 04027740205 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.