News March 30, 2025
NLG: 31 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయి

ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) క్రమబద్ధీకరణ 25 శాతం రాయితీ ఇచ్చినందున దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్ ప్రకాశ్ తెలిపారు. ఆన్లైన్లో ఫీజు చెల్లిపునకు ఈనెల 31వ తేదీ వరకు గడువు ఉందని, అదే రోజు సెలకు సెలవు దినమైనప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని పేర్కొన్నారు.
Similar News
News September 15, 2025
కరీంనగర్: 24/7 తాగునీరు రావట్లే..!

ప్రజారోగ్య శాఖ అధికారుల అలసత్వంతో కరీంనగర్ పట్టణ ప్రజలకు 24/7 తాగునీరు అందడం లేదు. ఎల్ఎండీలో 23 టీఎంసీల నీరున్నా తాగునీటి సరఫరా ఎందుకు చేయడం లేదని నగరవాసులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి గంట మాత్రమే మంచినీటి సరఫరా జరుగుతోంది. పట్టణంలో 13వేల నల్లా కనెక్షన్లు ఉండగా 60వేల మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉంటుంది. అమృత్- 2 పథకంలో భాగంగా పట్టణమంతటా పైప్లైన్ల నిర్మాణం పూర్తయింది.
News September 15, 2025
విజయవాడలో ఇంటింటికీ మెడికల్ కిట్లు

న్యూ RRపేటలో డయేరియా కేసులు పెరగడంతో ప్రభుత్వం అక్కడ ప్రతి ఇంటికీ ఉచితంగా మెడికల్ కిట్లను పంపిణీ చేస్తోంది. ఈ కిట్‌లో రోగ నిరోధక శక్తిని పెంచే జింక్ టాబ్లెట్‌తో పాటు, బ్యాక్టీరియాను నివారించే మూడు రకాల మందులు, ORS ప్యాకెట్లు ఉన్నాయి. 2 లక్షల మెడికల్ కిట్లను పంపిణీ చేసి, వాటిని ఎలా వాడాలో అవగాహన కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. వీటితో పాటు హైజిన్ కిట్లను కూడా VMC అధికారులు పంపిణీ చేస్తున్నారు.
News September 15, 2025
ములుగు: మేడారం మహా జాతర రోడ్ మ్యాప్ పరిశీలన

సమ్మక్క- సారలమ్మ మేడారం మహా జాతరకు సంబంధించిన రోడ్ మ్యాప్‌లను మంత్రి సీతక్క ఆదివారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ శబరీష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై జాతర జరిగే ప్రాంతాలను ఆమె కలియతిరిగారు. మహా జాతరకు ఆరు నెలల ముందే రోడ్డు పనులు, కలవర్టు పనులను ప్రారంభించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.