News March 11, 2025
NLG: 331 మంది విద్యార్థులు గైర్హాజరు

నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సోమవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 13,136 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 12,805 మంది హాజరయ్యారు. 331 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ శాఖ అధికారి దశ్రు నాయక్ తెలిపారు.
Similar News
News October 16, 2025
పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన నల్గొండ కలెక్టర్

శాలిగౌరారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్య అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
News October 16, 2025
NLG: గాడి తప్పుతున్న విద్యాశాఖ..!

NLGలో విద్యాశాఖ గాడి తప్పుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, పట్టింపు లేమి వెరసి ఆ శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరేళ్లుగా రెగ్యూలర్ DEO లేకపోవడంతో ఇక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రస్తుతం FAC DEO బిక్షపతి అసలు పోస్టు వరంగల్ (D) లష్కర్ బజార్ ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్ గ్రేడ్-1 గెజిటెడ్ హెడ్ మాస్టర్. 2019 OCTలో డిప్యూటేషన్పై ఇక్కడికి వచ్చారు.
News October 16, 2025
NLG: రేపే జాబ్ మేళా

రేపు ఉదయం 10.30 గంటలకు నల్గొండలోని ఐటీఐ క్యాంపస్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. జిల్లాలో పదో తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ (అన్ని ట్రేడ్ల)లో ఉత్తీర్ణత పొందిన 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గలవారు అర్హులని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.