News September 2, 2024
NLG: 498 ఎకరాల్లో నీట మునిగిన పంట

జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 4 మండలాల్లో 498ఎకరాల్లో వరి, పత్తి, మిరప పంటలు నీట మునిగాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. వాడపల్లిలో పత్తి 20 ఎకరాలు, వరి 100 ఎకరాలు, మాడ్గులపల్లి మండలం కాల్వపల్లిలో వరి 2 ఎకరాలు, వేములపల్లి, శెట్టిపాలెం, రావుల పెంటలో 350 ఎకరాల్లో వరి, గుర్రంపోడు మండలం రేపల్లెలో మిరప 3 ఎకరాలు, పెద్దవూరలోని చలకుర్తిలో 3 ఎకరాల్లో వరి నీట మునిగినట్లు తెలిపారు.
Similar News
News November 17, 2025
చలికి గజ గజ.. మంటలతో ఉపశమనం..!

నల్గొండ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి చల్లని గాలులు వీచడం ప్రారంభమై తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఈ చలి ప్రభావం అధికంగా ఉంది. అనేక చోట్ల చలి నుంచి ఉపశమనం పొందడానికి గ్రామాలలో ఎక్కువ శాతం మంటలు వేసుకుంటున్నారు.
News November 17, 2025
సమ్మె వద్దు.. సమస్యలు పరిష్కరిస్తాం: నల్గొండ కలెక్టర్

పత్తి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సమ్మె విరమించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిన్నింగ్ మిల్లుల యజమానుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా తాము రాష్ట్ర అసోసియేషన్తో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని జిన్నింగి మిల్లుల యజమానులు కలెక్టర్కు తెలిపారు.
News November 17, 2025
మునుగోడు: తెలుగు ఉపాధ్యాయుడి సస్పెన్షన్

మునుగోడు(M) పలివెల జడ్పీ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు గేర నరసింహను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. 4 రోజుల క్రితం ఆ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థి హనుమాన్ మాల వేసుకుని పాఠశాలకు రాగా సదరు ఉపాధ్యాయుడు అసభ్యంగా మాట్లాడడంతో పాటు మాలతీసి పాఠశాలకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రాథమిక విచారణ చేసిన అనంతరం ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.


