News March 8, 2025
NLG: 576 మంది విద్యార్థులు గైర్హాజరు

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష జిల్లావ్యాప్తంగా శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. మొత్తం 14,403 మంది విద్యార్థులకు గాను 13,827 మంది హాజరయ్యారు. కాగా 576 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు.
Similar News
News March 24, 2025
BREAKING: నల్గొండ జిల్లాలో భారీ చోరీ

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి వాసవి బజారులో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుంగడులు ఓ ఇంట్లో చొరబడి 30 తులాల బంగారం, రూ.5 లక్షల నగదును దోచుకెళ్లారు. గుర్తించిన బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News March 24, 2025
నల్గొండ: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వివరాలిలా.. HYDకి చెందిన ఉదయ్‌కిరణ్ నేరేడుగొమ్ము మండలం పుష్కర ఘాట్‌లో మునిగి చనిపోయాడు. నల్గొండ మండలానికి చెందిన నవీన్ కుమార్, రాఘవేంద్ర ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందారు. సూర్యాపేట జిల్లాలోని బీబీగూడెంలో కారు, బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు.
News March 24, 2025
నల్గొండ: లాడ్జిలో వ్యక్తి మృతదేహం లభ్యం

నల్గొండ పట్టణంలోని రూపా లాడ్జిలో గుర్తుతెలియని వ్యక్తి(35) డెడ్ బాడీని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇతడు విజయవాడ ఫైర్ వర్క్స్‌లో పనిచేస్తున్నట్లు లాడ్జి రికార్డ్స్‌లో ఉందని నల్గొండ టూ టౌన్ పీఎస్ SI సైదులు తెలిపారు. మృతుడిని నవీన్‌గా గుర్తించామన్నారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే 87126 70176 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.