News October 2, 2025

NLG: 6.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. 375 కేంద్రాలు!

image

వానాకాలం వరిధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో 375 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కాగా ఈ సంవత్సరం జిల్లాలో 6,30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. సన్న, దొడ్డు ధాన్యానికి వేరువేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

Similar News

News October 3, 2025

NLG: మద్యం టెండర్‌లకు మందకొడిగా దరఖాస్తులు..!

image

మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ నల్గొండ జిల్లాలో మందకొడిగా సాగుతుంది. 154 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన రావడంతో ప్రభుత్వం ఆశించినమేర దరఖాస్తులు రావడం లేదు. 26వ తేదీ నుంచి నేటి వరకు 8 దరఖాస్తులే వచ్చాయి. పాత వారితోపాటు కొత్త వ్యక్తులు బరిలో ఉంటారని భావించినప్పటికీ దరఖాస్తుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఈనెల 18 దరఖాస్తులకు చివరి తేదీ.

News October 3, 2025

NLG: నిమ్మకాయల ధర పతనం

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిమ్మకాయలకు ధర లేక రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ముఖ్యంగా NLG, SRPT జిల్లాలో రైతులు అధికంగా నిమ్మ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలలో ఈసారి భారీగా నిమ్మ దిగుబడులు పెరిగాయి. పది రోజుల నుంచి నిమ్మ ధరలు సగానికి సగం పడిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బస్తా ధర రూ.300లకే మించి రావడం లేదని తెలిపారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలంటున్నారు.

News October 2, 2025

‘గాంధీ మహాత్ముడు కూడా దైవ స్వరూపమే’

image

చిట్యాల మండలం పెద్దకాపర్తి గాంధీ గుడిని VJA-HYD జాతీయ రహదారి పై ప్రయాణించే వారు భక్తితో దర్శిస్తుంటారు. గుడికి వచ్చిన భక్తులకు కంకణధారణ, అర్చన చేసి హారతి ఇచ్చి, డ్రై ఫ్రూట్స్ ను ప్రసాదంగా అందిస్తామని ఆలయ పురోహితులు కూరెళ్ళ నరసింహాచారి తెలిపారు. గాంధీ కూడా దైవ స్వరూపమేనని అన్నారు. దర్శనం అనంతరం కాసేపు గుడి వద్దే కూర్చుని భక్తులు ధ్యానం చేసి వెళ్తుంటారని చెప్పారు.