News April 3, 2025

NLG: 7 నుంచి పదో తరగతి పరీక్షల మూల్యాంకనం

image

పదో తరగతి పరీక్షలు బుధవారంతో ముగిశాయి. మార్చి 21న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 2న సాంఘిక శాస్త్రం పరీక్షతో పూర్తయ్యాయి. బుధవారం జరిగిన పరీక్షకు మొత్తం 18,666 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 18,628 మంది హాజరయ్యారు. 38 మంది గైర్హాజరయ్యారు. 99.79 శాతం హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. పదో తరగతి పరీక్షలు ముగియడంతో ఈ నెల 7వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం జరగనున్నది.

Similar News

News April 4, 2025

NLG: TCC కోర్స్ వేసవి శిక్షణ శిబిరం

image

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ వేసవి శిక్షణ శిబిరాన్ని మే 1 నుంచి జూన్ 11 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో బొల్లారం బిక్షపతి తెలిపారు. నల్గొండలోని డైట్ ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కర్నాటిక హిందుస్థాని సంగీతం, వుడ్ వర్క్ కోర్సులలో శిక్షణ ఇస్తామన్నారు.  అర్హులైన వారు ఏప్రిల్ 17 నుంచి 29 వరకు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

News April 4, 2025

భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాల పంపిణీ

image

హైదరాబాద్ సైబర్ గార్డెన్‌లో నల్గొండ జిల్లా వీర్లపాలానికి చెందిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరై ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

News April 4, 2025

NLG: పారితోషికం కోసం ఎదురుచూపు

image

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే వివరాలను ఆన్‌లైన్లో పొందుపర్చిన డాటా ఎంట్రీ ఆపరేటర్లకు నేటికీ పారితోషికం అందలేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం సుమారు 3000 మందికి పైగానే డాటాఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వారికి పారితో కింద ఒక్కో ఫామ్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినందుకు రూ.25 ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ నేటి వరకు పారితోషికం అందించలేదని ఆపరేటర్లు తెలిపారు.

error: Content is protected !!