News July 20, 2024
NLG: DCCB పరిధిలో సగం మందికే రుణమాఫీ!

ఉమ్మడి జిల్లాలోని 111 PACSలలో సభ్యులుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న రైతుల్లో అందరికీ రూ.లక్షలోపు రుణమాఫీ కాలేదు. శుక్రవారం నాటికి డీసీసీబీ నుంచి అందిన సమాచారం ప్రకారం రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారిలో సగం మంది రుణాలే మాఫీ అయ్యాయి. ఆ జాబితా మాత్రమే డీసీసీబీకి అందినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో డిసిసిబి పరిధిలో 72,513 మంది లక్ష లోపు రుణాలు తీసుకున్నారు.
Similar News
News January 7, 2026
నల్గొండ: ఈ నెల 10 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ పరీక్షలు

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఈనెల 10 నుంచి 13 వరకు జరుగుతాయని డీఈఓ బిక్షపతి తెలిపారు. డ్రాయింగ్, టైలరింగ్ (లోయర్ & హైయర్) అభ్యర్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. టైలరింగ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ సొంత కుట్టు మెషీన్లను తప్పనిసరిగా తెచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోనే పరీక్షలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు.
News January 7, 2026
చెరువుగట్టులో దేవుడికే శఠగోపం..!

చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో కొంతమంది సిబ్బంది దేవుడికే శఠగోపం పెడుతున్నట్లు సమాచారం. ఆలయంలో అన్నదానానికి భక్తులు ఇస్తున్న విరాళాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ భక్తుడు అన్నదానానికి రూ.5 వేలు విరాళంగా ఇచ్చాడు. దీంతో ఆలయ సిబ్బంది అతనికి రూ.5 వేలకు రశీదు ఇచ్చారు. కానీ ఆలయానికి మాత్రం 1000 జమ చేశాడని రాశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
News January 7, 2026
పాడిపై చలిపంజా: తగ్గుతున్న పాల ఉత్పత్తి!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో చలి తీవ్రత పాడి పరిశ్రమపై పెను ప్రభావం చూపుతోంది. డిసెంబర్ నుంచి చలి పెరగడంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా 15 లక్షల పశువులు ఉండగా, 5 లక్షల పశువుల ద్వారా రోజుకు 25 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం చలి కారణంగా లీటర్ల కొద్దీ దిగుబడి తగ్గి, పాడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.


