News July 20, 2024

NLG: DCCB పరిధిలో సగం మందికే రుణమాఫీ!

image

ఉమ్మడి జిల్లాలోని 111 PACSలలో సభ్యులుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న రైతుల్లో అందరికీ రూ.లక్షలోపు రుణమాఫీ కాలేదు. శుక్రవారం నాటికి డీసీసీబీ నుంచి అందిన సమాచారం ప్రకారం రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారిలో సగం మంది రుణాలే మాఫీ అయ్యాయి. ఆ జాబితా మాత్రమే డీసీసీబీకి అందినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో డిసిసిబి పరిధిలో 72,513 మంది లక్ష లోపు రుణాలు తీసుకున్నారు.

Similar News

News December 1, 2024

కోదాడ: బావిలో పడి విద్యార్థి మృతి

image

అనంతగిరి మండలం శాంతినగర్‌లోని ఎస్సీ హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థి తిరుమలేష్ బావిలో పడి మృతి చెందాడు. తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సెలవు కావడంతో ట్యూటర్ వీరబాబు ఇద్దరు విద్యార్థులను తన పొలం వద్ద పని ఉందని తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో వీరబాబు వ్యవసాయ బావిలో స్నానానికి దూకగా, అతనితోపాటు విద్యార్థి తిరుమలేష్ దూకాడు. ఈత రాకపోవడంతో తిరుమలేష్ మృతి చెందాడు.

News December 1, 2024

గోపలాయపల్లిలో రైల్వే ట్రాక్‌పై యువకుడు ఆత్మహత్య

image

నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లిలో రైల్వే ట్రాక్‌పై యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన కామసాని వేణుకుమార్ రెడ్డి(29) శనివారం రాత్రి వేణుగోపాల స్వామి దేవస్థానం కమాన్ దగ్గరలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. వేణుకుమార్ రెడ్డికి కొద్దిరోజుల క్రితమే ఎంగేజ్‌మెంట్ అయ్యిందని తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News December 1, 2024

డిసెంబర్ 3న యాదగిరిగుట్ట స్వామి వారి హుండీ లెక్కింపు

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని డిసెంబర్ 3న లెక్కించనున్నట్లు శనివారం ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం ఏడు గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లచే, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో ఉండి లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.