News March 18, 2024
NLG: ఉమ్మడి జిల్లాలో గడ్డికి గడ్డుకాలం

మూగజీవాలకు పశుగ్రాసం కొరత వెంటాడుతోంది. ఉమ్మడి జిల్లాలో రైతులకు గడ్డు రోజులు ఎదురవుతున్నాయి. ఎండుగడ్డి కొరత తీవ్రంగా ఉండడంతో పశుపోషణ రోజురోజుకు భారంగా మారుతోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఎడమకాల్వ, మూసీ ప్రాజెక్టు, శాలిగౌరారం ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టులో గతేడాది నీరు సమృద్ధిగా ఉన్న కారణంగా యాసంగిలో లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆయకట్టులో సాగు విస్తీర్ణం తగ్గింది.
Similar News
News April 13, 2025
NLG: రాత్రికి రాత్రే శివలింగం ప్రత్యక్షం..!

నల్గొండ మండలం నర్సింగ్ బట్ల గ్రామ శివారులో అర్ధరాత్రి శివలింగం ప్రత్యక్షమైంది. ఆ శివలింగాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇది ఆకతాయిల పనేనని గ్రామస్థులు భావిస్తున్నారు. శివలింగం ప్రత్యక్షమైన స్థలం కొంత వివాదంలో ఉన్నట్లు తెలిసింది.!
News April 13, 2025
NLG: దరఖాస్తు చేసుకోలేకపోయాం.. గడువు తేదీ పొడగించండి!

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును ఈనెల చివరి వరకు పొడిగించాలని జిల్లాలోని యువకులు కోరుతున్నారు. చాలామంది వివిధ కారణాలతో పాటు సర్వర్ డౌన్ కావడంతో దరఖాస్తు చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగుస్తోంది. చాలామంది యువకులు కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలను తీసుకోలేకపోయారు. ప్రభుత్వం స్పందించి గడువు తేదీని పొడిగించాలని కోరుతున్నారు.
News April 13, 2025
నల్గొండ జిల్లాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదు

జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. గత రెండు మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం దామరచర్ల మండలంలో 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అతి తక్కువగా చింతపల్లి మండలం గోడకండ్లలో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా బీబీనగర్ బొమ్మలరామారంలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.