News January 26, 2025
NLG: KCR హయాంలోనే HAPPY: మాజీ MLA

మాజీ సీఎం KCR హయాంలోనే సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనలు, అరెస్టులు, ప్రజాపాలన గ్రామసభల దరఖాస్తుల పేరుతో ప్రజలను అయోమయానికి గురి చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దాకా ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు.
Similar News
News October 23, 2025
మహిళలూ బండిపై ప్రయాణిస్తున్నారా..ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఈ బిజీ ప్రపంచంలో మహిళలు కూడా నిత్యం వాహనాలు నడపడం తప్పనిసరైంది. అయితే ఈ సమయంలో ప్రమాదాలు నివారించడానికి కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. బండి నడిపేటపుడు చీర కొంగు, చున్నీ ఎగరకుండా బిగించి కట్టుకోవాలి. లేదంటే చక్రాలకు శారీగార్డు ఏర్పాటు చేసుకోవాలి. హెల్మెట్ వాడటం తప్పనిసరి. పిల్లలతో ప్రయాణించేటపుడు టూ వీలర్ బేబీ బెల్ట్, ఛైల్డ్ క్యారియర్ వాడటం వల్ల ప్రమాదాల తీవ్రత తగ్గుతుంది.
News October 23, 2025
మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన కలెక్టర్

బూర్గంపాడు మండలం ఎంపీ బంజారలో సమీకృత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే దిశగా మోడల్ ఫామ్ షెడ్ నిర్మాణ పనులను కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం ప్రారంభించారు. రైతుల ఆర్థికాభివృద్ధి దిశగా వ్యవసాయ ఆధారిత అనుబంధ రంగాలను సమీకరించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రైతులు కూరగాయల సాగుతో పాటు బంతిపువ్వులు, కొర్రమీను చేపల, కౌజు పిట్టలు, మేకల పెంపకం వంటి పలు రంగాలను ఒకే ఆవరణలో నిర్వహించాలని సూచించారు.
News October 23, 2025
డ్రగ్స్ నిర్మూలనకు అందరూ సహకరించాలి: జిల్లా కలెక్టర్

డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలు, పిల్లలు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళలకు, కళాశాల విద్యార్థులకు డ్రగ్స్‌తో కలిగే అనర్థాలను తెలియపరిచేందుకు రంగోలీ పోటీలు నిర్వహించారు.