News June 7, 2024

NLG-KMM-WGL: 33 మంది ఎలిమినేషన్

image

NLG-KMM-WGL ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,696 ఆధిక్యంలో ఉన్నారు. గెలుపునకు కావాల్సిన కోటా ఓట్లు 1,55,095 అవసరం ఉండగా మల్లన్నకు గెలుపునకు ఇంకా 31,885 ఓట్లు రావాలి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 50,581 ఓట్లు కావాలి.

Similar News

News November 25, 2025

నల్గొండ: ఆకట్టుకున్న ఇందిరమ్మ గృహప్రవేశం

image

మాడ్గులపల్లి మండలం పోరెడ్డిగూడెంలో ఇందిరమ్మ గృహప్రవేశం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలంతా ఇందిరమ్మ చీరలు కట్టుకున్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌తో కలిసి వారు ఫొటో దిగగా ఆకట్టుకుంటోంది.

News November 25, 2025

NLG: రిజర్వేషన్లు.. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేసిన జీవో 46 ద్వారా ఖరారు చేసిన గ్రామ పంచాయతీ రిజర్వేషన్లతో సీట్లు తారుమారై అలజడి రేపింది. గ్రామాల్లో ఉన్న జనాభా ధామాషా ప్రకారం రొటేషన్ పద్ధతిలో ఈ సారి తమకే రిజర్వేషన్ ఖరారవుతుందనే ఆశతో ఇంతకాలం నిరీక్షించిన నాయకులకు రిజర్వేషన్ల మార్పులతో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. జిల్లాలో ఎన్నో రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రిజర్వేషన్లు కొందరి జాతకాలను తారుమారు చేశాయి.

News November 25, 2025

జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు

image

నల్గొండ జిల్లాకు 3.66 లక్షల ఇందిర మహిళా శక్తి చీరలు వచ్చాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. డిప్యూటీ సీఎం విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 లక్షల చీరలను పంపిణీ చేసినట్లు ఆమె వెల్లడించారు. చీరల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.