News June 7, 2024
NLG-KMM-WGL: 33 మంది ఎలిమినేషన్

NLG-KMM-WGL ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్లో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 18,696 ఆధిక్యంలో ఉన్నారు. గెలుపునకు కావాల్సిన కోటా ఓట్లు 1,55,095 అవసరం ఉండగా మల్లన్నకు గెలుపునకు ఇంకా 31,885 ఓట్లు రావాలి. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి 50,581 ఓట్లు కావాలి.
Similar News
News December 24, 2025
ఖమ్మం: సర్పంచ్లకు ‘పంచాయతీ’ పాఠాలు

ఖమ్మం కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 5 నుంచి 9 వరకు హైదరాబాద్లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా నుంచి ఎంపికైన 33 మంది అధికారులు శిక్షణ పొంది, అనంతరం సర్పంచ్లకు విధులు, నిధుల వినియోగంపై అవగాహన కల్పిస్తారు. పారదర్శక పాలనే లక్ష్యంగా జిల్లా అధికారులు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 24, 2025
ఖమ్మం గజగజ

ఖమ్మం జిల్లాలో ‘చలిపులి’ పంజా విసురుతోంది. గత పది రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. తెల్లవారుజామున పొగమంచు వల్ల వాహనదారులు,మున్సిపల్ కార్మికులు, పాలు,కూరగాయల విక్రేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి ధాటికి వృద్ధులు, పిల్లలు అల్లాడుతుండగా పొలాల వద్ద రైతులు చలిమంటలే శరణ్యమంటున్నారు. రానున్న 3రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
News December 24, 2025
ఖమ్మం: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఉమ్మడి జిల్లాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కో-ఆర్డినేటర్ వెంకటేశ్వరరావు తెలిపారు. 5వ తరగతితో పాటు, 6 నుంచి 9 తరగతుల్లో ప్రవేశం కోరే విద్యార్థులు వచ్చే ఏడాది జనవరి 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ రుసుము రూ.100 చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


