News December 26, 2025
NLG: LOVE AFFAIR.. భర్తను హత్య చేసిన టీచర్

ఓ ప్రభుత్వ టీచర్ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. CI నాగరాజు వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన లక్ష్మణ్ నాయక్-పద్మ దంపతులు అచ్చంపేటలో నివాసముంటున్నారు. పద్మకు తోటి ఉపాధ్యాయుడు గోపితో ఏర్పడిన సంబంధం భర్త హత్యకు దారితీసింది. గత నెల 25న లక్ష్మణ్‌ను ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం స్పృహతప్పి పడిపోయినట్లు నాటకమాడగా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు గురువారం నిందితులను అరెస్ట్ చేశారు.
Similar News
News December 26, 2025
KMR: రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం

కామారెడ్డిలోని పంచముఖి హనుమాన్ కాలనీ రైల్వే ట్రాక్ సమీపంలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందా? లేదా ఆత్మహత్యనా? అన్న కోణంలో విచారిస్తున్నట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపారు.
News December 26, 2025
ఛాంపియన్, శంబాల కలెక్షన్లు ఇవే?

నిన్న విడుదలైన ఛాంపియన్, శంబాల, దండోరా, ఈషా సినిమాలు పాజిటివ్ టాక్స్ తెచ్చుకున్నాయి. శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన ‘ఛాంపియన్’కు తొలిరోజు రూ.4.50 కోట్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. ఆది సాయికుమార్ నటించిన శంబాల మూవీకి రూ.3.3 కోట్లు వచ్చినట్లు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. హారర్ చిత్రం ఈషాకు రూ.1.6 కోట్లు వచ్చినట్లు టాక్. దండోరా కలెక్షన్లపై వివరాలు తెలియాల్సి ఉంది.
News December 26, 2025
ఢిల్లీలో పరేడ్.. జగిత్యాల మేడం సెలక్ట్..!

JAN 26న ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు TG & AP NCC క్యాడెట్స్‌ను సెలక్ట్ చేశారు. ఇందులో భాగంగా జగిత్యాలకు చెందిన అసోసియేట్ NCC ఆఫీసర్, PET చేని మంగా ANOగా ఎంపికయ్యారు. TG & AP డైరెక్టరేట్ NCC క్యాడెట్స్‌కు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాల్, విశ్వప్రసాద్, నిరంజన్, రవికుమార్, కృష్ణప్రసాద్, క్రీడాకారులు మంగను అభినందించారు.


