News April 25, 2024
NLG: MGUకు 28 నుంచి సెలవులు

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ, ఇంజినీరింగ్ కళాశాలలకు ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 2 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ MGU రిజిస్ట్రార్ అల్వాల రవి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం, ఇతర అడ్మినిస్ట్రేషన్ విభాగాలు యథావిధిగా పని చేస్తాయని ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News October 14, 2025
NLG: బాలాజీ నాయక్ పై ఫిర్యాదుల వెల్లువ

అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీనాయక్పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 112 ఫిర్యాదులు అందాయి. గుడిపల్లి పోలీస్ స్టేషన్కు బాధితులు అప్పు పత్రాలు, ఖాళీ చెక్కులతో తరలివచ్చారు. దీంతో పోలీస్ స్టేషన్లో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 185 మంది బాధితులు బాలాజీపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్యాంపును ఏఎస్పీ మౌనిక పర్యవేక్షించారు.
News October 14, 2025
రూ.20తో రూ.2లక్షల బీమా: కలెక్టర్ ఇలా త్రిపాఠి

వాహనాల ద్వారా స్వల్పకాలిక పనులు చేసే వారందరూ జీవిత బీమా సౌకర్యాన్ని కలిగి ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకుగాను వివిధ బ్యాంకులు రూ.2 లక్షలతో వివిధ రకాల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు. సంవత్సరానికి కేవలం రూ.20 చెల్లిస్తే బీమా వర్తిస్తుందన్నారు. కార్మికులందరికీ ప్రమాద బీమా వర్తింపజేసేందుకు శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
News October 13, 2025
ఇసుక తవ్వకాలపై నివేదిక కోరిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

జిల్లాలోని ఇసుక తవ్వకాలకు సంబంధించి కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను నివేదిక కోరారు. నీటిపారుదల, గనులు, భూగర్భ జల వనరులు, టీఎస్ ఎంఐడీసీ, అటవీ, రెవెన్యూ, ముఖ్య ప్రణాళిక అధికారి శాఖల నుంచి ఇసుక తవ్వకాలపై నివేదికలను అందించాలని ఆదేశించారు. ఆయా శాఖలు సమర్పించిన నివేదికలన్నింటిని పూర్తిస్థాయి జిల్లా సమగ్ర నివేదికగా మార్చి అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.