News July 8, 2024
NLG: MLAతో కలిసి స్ట్మార్ట్ క్లాస్ రూంలు ప్రారంభించిన మంచు లక్ష్మి

భువనగిరిలోని భాగాయత్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాస్రూమ్లను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి సినీ నటి మంచు లక్ష్మీ సోమవారం ప్రారంభించారు. స్మార్ట్ క్లాస్ రూమ్లతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Similar News
News November 9, 2025
NLG: కూరగాయలు కొనేటట్లు లేదు..!

నల్గొండ జిల్లాలో కూరగాయల ధరలు పైపైకి పోతున్నాయి. నెల రోజుల నుంచి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల క్రితం ఏ కూరగాయలను తీసుకున్నా కేజీ రూ.20 నుంచి రూ.30 వరకే ఉండేవి. అలాంటిది ఒకేసారి కార్తీకమాసంలో రూ.60 నుంచి రూ.160 వరకు ఎగబాకాయి. ప్రతీరోజూ కూరల్లో వాడే టమోటాలు కేజీ రూ.40కు ఎగబాకింది. ఎన్నడూ లేనట్టుగా కేజీ బీన్స్ రూ.160 వరకు ఉంది. మునగ కాయలు భారీ ధర పలుకుతున్నాయి.
News November 8, 2025
నల్గొండ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

→మిర్యాలగూడ : మత్తు మాత్రలు అమ్ముతున్న ముఠా అరెస్ట్
→మునుగోడు: అయ్యప్ప స్వాములకు ముస్లిం అన్నదానం
→HYD-VJD హైవే 8 లేన్ల విస్తరణ: కోమటిరెడ్డి
→నల్లగొండ: చెరువుకు చేరుతున్న చేప.. 6 కోట్ల చేప పిల్లల పంపిణీ
→నల్లగొండ: ఎల్లలు MGU దాటిన ఖ్యాతి
→నల్లగొండ: ఈ ఇసుక ఎక్కడి నుంచి వస్తుందో..
→నల్లగొండ: పలువురు జడ్జీలకు స్థాన చలనం
→చిట్యాల: రోడ్డు ప్రమాదం.. కారు పూర్తిగా దగ్ధం
News November 8, 2025
మిర్యాలగూడ: మత్తు మాత్రలు అమ్ముతున్న ముఠా అరెస్ట్

మత్తు మాత్రలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. ఈదులగూడ చౌరస్తా వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు పట్టుకున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా పాస్మో ప్రోగ్సి వొన్ ప్లస్ మాత్రలను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.


